ఇందిరమ్మ టవర్స్‌లో ఫ్లాట్ల కేటాయింపునకు దరఖాస్తుల ఆహ్వానం

0
1

నిజామాబాద్: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న అర్హులైన నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.

ఇందిరమ్మ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ పథకం కింద అందుబాటులో ఉన్న ఫ్లాట్ల కేటాయింపునకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.

అర్హత కలిగిన నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.