గుండ్లరేవులో డ్రైన్, సోక్ పిట్ నిర్మాణ పనులు ప్రారంభం
గ్రామ పారిశుద్ధ్య మెరుగుదలకు ప్రత్యేక చర్యలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా – జూలూరుపాడు మండలం: గుండ్లరేవు గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరిచే లక్ష్యంతో శుక్రవారం గ్రామపంచాయతీ పరిధిలో డ్రైన్, సోక్ పిట్ నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ నిర్మాణ పనులను సర్పంచ్ భూక్యా చంద్రబాబు, ఎంపీడీవో అజయ్, ఎంపీవో తులసీరాం, ఏపీవో రామారావు, గ్రామపంచాయతీ కార్యదర్శి కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పనుల నాణ్యతను పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు.
గ్రామంలో మురుగునీటి సమస్యలు తలెత్తకుండా, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు డ్రైన్, సోక్ పిట్ నిర్మాణాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.










