జూలూరుపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం – స్వయం పరిపాలన దినోత్సవం

0
4

జూలూరుపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం – స్వయం పరిపాలన దినోత్సవం

 

జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం చాచా నెహ్రూ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని కూడా నిర్వహించారు.

 

ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించి, తరగతి గదుల్లో పాఠాలు బోధించారు. రెగ్యులర్ ఉపాధ్యాయుల మాదిరిగా చక్కటి బోధనా నైపుణ్యాలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.

 

విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే క్రమశిక్షణ, అంకితభావం, బాధ్యతాయుతమైన ప్రవర్తన, నాయకత్వ లక్షణాలు, వాక్చాతుర్యం, బోధనా నైపుణ్యాలను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రధానోపాధ్యాయులు టీ. లక్ష్మీనరసయ్య తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిని భవిష్యత్తులో మంచి నాయకులుగా, బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు నిమ్మగడ్డ ఉమ, సూరపనేని శాంతకుమారి, గుడిపూడి వెంకటేశ్వర్లు, గురుమూర్తి, బానోత్ అరుణ, పనితి రామనాథం, ఉమామహేశ్వరి, గార్లపాటి ప్రసాద్, శకుంతల, సావిత్రి, బోడ కృష్ణ, లకావత్ సర్దార్, కొండ నాగరమేష్, లలిత, సునీత, జూనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.