పాల్వంచ 38వ డివిజన్‌లో కొత్త పెన్షన్ల మంజూరు.. లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్లు పంపిణీ.

0
3

పాల్వంచ 38వ డివిజన్‌లో కొత్త పెన్షన్ల మంజూరు.. లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్లు పంపిణీ

 

పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని 38వ డివిజన్‌లో నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ల ప్రొసీడింగ్ ఆర్డర్లను కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కార్పొరేటర్ బత్తుల మధుచంద్ కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

 

కార్పొరేటర్ బత్తుల మధుచంద్ ప్రత్యేక చొరవతో పెన్షన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమకు సహకరించిన కార్పొరేటర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

 

అర్హులైన పేద, నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్న కార్పొరేటర్‌ను డివిజన్ ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రజలు, నూతన పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.