నిజామాబాద్ సుభాష్‌నగర్‌లోని ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకున్నారు. చిన్నారుల ఆటపాటలు, చిరునవ్వులతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు బాలల దినోత్సవ ప్రాముఖ్యతను వివరిస్తూ, విద్యార్థులకు చాచా నెహ్రూ ఆశయాలను తెలియజేశారు. పిల్లలలో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.










