బిగ్ బ్రేకింగ్ న్యూస్ :మోత్కూరులో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కారుకు ప్రమాదం..

0
1

యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేపట్టిన పాదయాత్రలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూరు మండలం, అనాజిపురం గ్రామం వద్ద మల్లన్న పాదయాత్ర తిరుమలగిరి వైపు సాగుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ కాన్వాయ్‌లోని ఫార్చునర్ కారును బలంగా ఢీకొట్టింది.

దీంతో అదుపుతప్పిన ఫార్చునర్ కారు ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టడంతో రెండు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఫార్చునర్ కారు పూర్తిగా ధ్వంసమైంది.

ఈ ప్రమాదంలో మరో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీన్మార్ మల్లన్న ప్రమాద సమయంలో కారులో కాకుండా కాలినడకన పాదయాత్రలో ముందుకు సాగుతుండటంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.