గిగ్ వర్కర్ల సంక్షేమం, సామాజిక భద్రత, ప్రమాద బీమా, ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత వంటి అంశాలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పలు చర్యలను ప్రకటించే అవకాశం ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి వెల్లడించారు.
తెలంగాణలో సుమారు ఆరు లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నట్లు మంత్రి తెలిపారు.
భారత్ సమ్మిట్–2026 ముగింపు కార్యక్రమంలో కీలక ప్రసంగం
హైదరాబాద్లో నవంబర్ 13, 14 తేదీల్లో జరుగుతున్న భారత్ సమ్మిట్–2026లో సుమారు 70 దేశాలకు చెందిన ప్రతినిధులు, అంతర్జాతీయ రాజకీయ నాయకులు, మేధావులు, విధాన నిర్ణేతలు పాల్గొంటున్నారు.
ప్రపంచ ప్రజాస్వామ్యం, ఆర్థిక న్యాయం, వాతావరణ మార్పులు, కృత్రిమ మేధస్సు (AI), అంతర్జాతీయ సంబంధాలు తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చలు జరుగుతున్నాయి.
నవంబర్ 14న భారత్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నా










