మిర్యాలగూడ పట్టణంలోని *హౌసింగ్ బోర్డు ప్రాంతంలో ఉన్న చిన్న చెరువుపై చేపట్టిన* చెరువు కట్ట నిర్మాణ పనులను *ఈరోజు గౌరవ ఎమ్మెల్యే శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి (BLR) గారితో మిర్యాలగూడ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి చిలుకూరి సుధ బాలకృష్ణ గారు* కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని, సంబంధిత వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో, ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ గారు మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలోని చెరువులను సంరక్షించడం, నీటి వనరులను కాపాడుకోవడం, వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు.
చెరువులను కేవలం నీటి నిల్వ కేంద్రాలుగానే కాకుండా, పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేలా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. చెరువుల పరిరక్షణతో భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించవచ్చని పేర్కొన్నారు.
💧 నీటిని కాపాడుకుందాం – చెరువులను సంరక్షిద్దాం
భారత్ అవాజ్
మిర్యాలగూడా










