ప్రపంచ ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న సవాళ్లు
మంత్రి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, ప్రపంచ శాంతి కోసం పనిచేసిన అంతర్జాతీయ సంస్థల పాత్రపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.
భవిష్యత్ తరాలకు ఎలాంటి ప్రపంచాన్ని అందించాలనే అంశంపై నాయకులు, మేధావులు, విధాన రూపకర్తలు కలిసి చర్చించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరువాత తెలంగాణలో నాలుగో నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వివరించారు.
భవిష్యత్ తరాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధమైన నగర నిర్మాణం.
పరిశ్రమలు, విద్య, పరిశోధన, సాంకేతిక రంగాలకు ప్రాధాన్యత.
పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ స్పేస్‌ల అభివృద్ధి.
వర్షపు నీటి సంరక్షణ, నీటి పునర్వినియోగం.
సౌర విద్యుత్, సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ.
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భారత్ ఫ్యూచర్ సిటీ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరువాత తెలంగాణలో నాలుగో నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వివరించారు









