రాష్ట్రంలో నిర్వహించనున్న రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల ఎడమ చేయి చిటికనవేలి మీద చెరగని సేరా గుర్తు వేయనున్నట్లు కలెక్టర్ జిల్లా,ఎన్నికల అధికారి సాయికాంత్ వర్మ తెలిపారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ,జడ్పిటిసి ఎన్నికల్లో ఎడమ చేతి చూపుడు వేలికి వేసిన సీరా గుర్తు ఇంకా కనిపించే అవకాశం ఉందన్నారు.ఓటింగ్ సమయంలో గందరగోళం తల ఎత్తకుండా ఎడమ చేయి చూపుడు వేలి మీద సీరా వేయాలని ఈసీ ఆదేశించిందన్నారు. ఎలక్షన్ కాలంలో ఓటు వేసే వారికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా ఓటు వేసి వచ్చే విధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు.










