బోడుప్పల్ లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద రోడ్డుపై వేగంగా వచ్చిన బైక్, యాక్టీవా పై వెళ్తున్న మరో వాహనాన్ని వెనక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో యాక్టీవా పై ఉన్న 50 ఏళ్ల మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటన స్థలంలో ట్రాఫిక్ కు స్వల్ప అంతరాయం కలగగా, స్థానికుల ప్రకారం ప్రమాదానికి యువకుల అతి వేగం కారణమని తెలుస్తుంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు.









