హైదరాబాద్లోని హెచ్ఐసీసీ వేదికగా నవంబర్ 13, 14 తేదీల్లో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక భారత్ సమ్మిట్ 2026 కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ పాల్గొన్నారు.
ఈ అంతర్జాతీయ సదస్సులో సుమారు 70 దేశాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, మేధావులు, విధాన రూపకర్తలు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ విలువలు, సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం వంటి కీలక అంశాలపై చర్చలు జరిగాయి.
మంత్రి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగ విలువలు, సమానత్వం, న్యాయం, ప్రజల హక్కులకు అత్యంత ప్రాధాన్యత ఉండాలని పేర్కొన్నారు. ప్రభుత్వాలు ప్రజల సమస్యలను బాధ్యతాయుతంగా పరిష్కరించాలని, ప్రజల అభిప్రాయాలను గౌరవించాలని సూచించారు.









