వైఎస్సార్‌సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన సువర్ణపురం గ్రామస్తులు

0
5

కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో టీడీపీలోకి 10 కుటుంబాలు

పలాస: కూటమి ప్రభుత్వ పాలనపై నమ్మకంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వైఎస్సార్‌సీపీకి చెందిన సుమారు 10 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి.

సోమవారం పలాస ఎమ్మెల్యే కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో మందస మండలం సువర్ణపురం పంచాయతీకి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

సిర్ల కృష్ణారావు, బతకల వెంకటరావు, కోణారి తులసిరావుల ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం నిర్వహించారు.

టీడీపీలో చేరిన వారిలో బతకల చలపతి, బతకల నాగేశ్వరరావు, బతకల జానకమ్మ, బతకల సరస్వతి, బతకల దమయంతి, బతకల యాదవరావు, బతకల విశ్వనాథం, బతకల జయమ్మ, బతకల ధనలక్ష్మి, బతకల శ్యాంసుందర్ ఉన్నారు.

ఈ కార్యక్రమంలో కరగాన వాసు, అడ్డి ఈశ్వరరావు, బతకల జోగారావు, కోణారి మురళీమోహన్, హరిప్రసాద్, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.