కలెక్టరేట్ ఎదుట వైద్య విద్యార్థుల వినూత్న నిరసన ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన

0
1

🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా  ఆసిఫాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ శ్రీలక్ష్మి నియామకాన్ని వ్యతిరేకిస్తూ వైద్య విద్యార్థులు ఆందోళన బాట పట్టారు.

జిల్లా కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు తమ ముఖాలకు పాలిథిన్ కవర్లతో మాస్కులు ధరించి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ నియామకాన్ని రద్దు చేసి, పాత ప్రిన్సిపల్‌నే తిరిగి నియమించాలని వారు డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తమ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని విద్యార్థులు కోరారు.