తెనాలి పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ సమీప ప్రధాన రహదారిని మునిసిపల్ కమిషనర్ రామా అప్పలనాయుడు సోమవారo పరిశీలించారు. రహదారి వెంట పచ్చదనం పెంపొందించి మొక్కలను చక్కగా నిర్వహించాలని గ్రీనరీ సిబ్బందికి సూచించారు. పరిసర ప్రాంతాల్లో పారిశుధ్యం మెరుగుపరిచి రహదారిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ని ఆదేశించారు. పట్టణంలోని ప్రతి వార్డులోనూ పారిశుద్ధ్య న్ని మెరుగుపరచలని ఆదేశించారు.










