నాచారం సెయింట్ పీటర్స్ మోడల్ స్కూల్‌లో అయ్యప్ప స్వాముల ఆందోళన

0
4

హైదరాబాద్‌లోని నాచారం రాఘవేంద్రనగర్‌లో ఉన్న సెయింట్ పీటర్స్ మోడల్ స్కూల్‌లో మరోసారి అయ్యప్ప మాల వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అయ్యప్ప స్వామి మాల ధరించి దీక్షలో ఉన్న తొమ్మిదో తరగతి విద్యార్థిని పాఠశాల యాజమాన్యం తరగతి గదిలోకి అనుమతించకుండా లైబ్రరీలో, మరో గదిలో కూర్చోబెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ విషయాన్ని విద్యార్థి తన తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు అయ్యప్ప స్వాముల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు పాఠశాల వద్దకు చేరుకుని యాజమాన్య తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.

గతంలోనూ ఇలాంటి ఘటనలు!

ఇదే పాఠశాలలో గతంలో కూడా అయ్యప్ప దీక్షలో ఉన్న విద్యార్థులకు ప్రవేశం నిరాకరించారనే ఆరోపణలతో వివాదం చోటుచేసుకుంది. 2024 నవంబర్ 18న ఇద్దరు విద్యార్థులను పాదరక్షలు లేకుండా పాఠశాలకు వచ్చిన కారణంగా అనుమతించలేదని వార్తలు వెలువడ్డాయి.