శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-5 బొగ్గు గనిని మంగళవారం ఫైవ్‌స్టార్ రేటింగ్ ఎవాల్యుయేషన్ కమిటీ బృందం సందర్శించి తనిఖీలు నిర్వహించింది.ఈ సందర్భంగా గనిలో భద్రతా ప్రమాణాలు, ఉత్పత్తి, ఉత్పాదకత, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలను కమిటీ పరిశీలించినట్లు పేర్కొన్నారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ మునిగంటి శ్రీనివాస్, గ్రూప్ ఏజెంట్ శ్రీ ఎన్. శ్రీధర్, గని మేనేజర్ శ్రీ సుధీర్ కుమార్ ఝా, ఎస్ఓ టు జీఎం శ్రీ కృష్ణ ప్రసాద్‌తో పాటు ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొని ఫైవ్‌స్టార్ రేటింగ్ ఎవాల్యుయేషన్ బృందంతో సమావేశమయ్యారు.ఈ తనిఖీల సందర్భంగా గని పనితీరు, భద్రతా నిర్వహణకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఫైవ్‌స్టార్ రేటింగ్ సాధన దిశగా గని అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.









