త్రాగునీటి పైపులైన్ లీకేజీలకు శాశ్వత పరిష్కారం చూపిన 9వ వార్డు కౌన్సిలర్ సాలం బిన్ అహ్మద్

0
4

🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): ఆసిఫాబాద్ మున్సిపాలిటీ లోని 9వ వార్డులో నెలకొన్న త్రాగునీటి సమస్యను వార్డు కౌన్సిలర్ సాలం బిన్ అహ్మద్ తక్షణమే పరిష్కరించారు. మంగళవారం ఉదయం వార్డులో మార్నింగ్ వాక్ నిర్వహిస్తూ స్థానికుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వార్డులోని పలు చోట్ల త్రాగునీటి పైపులైన్లు లీకేజీ అవుతుండటంతో ఇళ్లకు నీరు తక్కువగా సరఫరా అవుతోందని కాలనీవాసులు కౌన్సిలర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన సాలం బిన్ అహ్మద్, సంబంధిత మున్సిపల్ అధికారులను, సిబ్బందిని పిలిపించి దగ్గరుండి మరమ్మతులు చేయించారు. పైపులైన్ లీకేజీలను అరికట్టి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో 9వ వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కౌన్సిలర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.