ప్రమాదంలో గాయపడి శస్త్రచికిత్స చేయించుకున్న కాంగ్రెస్ నాయకుడు పూణెం శ్రీనివాస్ తండ్రిని పరామర్శించిన ఎంపీ రఘురామిరెడ్డి.

0
5

ప్రమాదంలో గాయపడి శస్త్రచికిత్స చేయించుకున్న కాంగ్రెస్ నాయకుడు పూణెం శ్రీనివాస్ తండ్రిని పరామర్శించిన ఎంపీ రఘురామిరెడ్డి

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి: మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు పూణెం శ్రీనివాస్ తండ్రి లక్ష్మీనర్సయ్య ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడి కుడికాలికి శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలుసుకున్న ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురామిరెడ్డి ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.

 

ఈ సందర్భంగా లక్ష్మీనర్సయ్య ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా పార్టీ పరంగా, వ్యక్తిగతంగా అండగా ఉంటానని భరోసా కల్పించారు.

 

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న, కోనేరు చిన్నీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగసీతారాములు, జేవీఎస్ చౌదరి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెదబాబు, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చీకటి కార్తీక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దేవరగట్ల ప్రసాద్, సర్పంచ్ తాటి అనిత, అజ్మీరా లైలా, ఉపసర్పంచ్ వద్దెం సతీష్, చావాల పురుషోత్తం, తాటి తిరుమలేశ్ తదితరులు పాల్గొన్నారు.