శ్రీరాంపూర్ సింగరేణి పాఠశాలను సందర్శించిన జీఎం (ఎడ్యుకేషన్) రాజేంద్ర ప్రసాద్

0
4

శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి పాఠశాలను మంగళవారం సంస్థ జీఎం (ఎడ్యుకేషన్) శ్రీ రాజేంద్ర ప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులతో ఆయన ముచ్చటించి, విద్యాబోధన, తరగతుల నిర్వహణ, పాఠశాలలో కల్పిస్తున్న మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.అనంతరం పాఠశాలలోని డిజిటల్ క్లాస్‌రూమ్‌లను సందర్శించి వాటి నిర్వహణ, వినియోగం గురించి పరిశీలించారు. అలాగే పాఠశాల ఆటస్థలాన్ని సందర్శించి అక్కడి సదుపాయాలను పరిశీలించారు.ఈ పర్యటనలో ఆయన వెంట శ్రీరాంపూర్ ఏరియా పర్సనల్ విభాగం డిప్యూటీ పర్సనల్ మేనేజర్ శ్రీ క్రాంతి కుమార్ పాల్గొన్నారు.