ఇటీవల నందర్పూర్ సమీపంలో జరిగిన కారు–ఆటో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, హైదరాబాద్లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలేపల్లి బీఆర్ఎస్ (BRS) అధ్యక్షులు బుగ్గప్ప సోదరుడిని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పరామర్శించారు
విషయం తెలుసుకున్న వెంటనే ఆయన ఆసుపత్రికి చేరుకుని బాధితుడిని కలిసి ధైర్యం చెప్పారు బాధిత కుటుంబ సభ్యులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు అనంతరం ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి బాధితుడి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు బాధితుడికి అత్యవసరమైన మెరుగైన వైద్య సేవలు అందించి త్వరగా కోలుకునేలా చూడాలని వైద్యులకు సూచించారు
ఈ పరామర్శ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వెంట తాలూకా వర్కింగ్ ప్రెసిడెంట్ మడిగే శ్రీనివాస్ దుద్యాల మండల బీఆర్ఎస్ యువజన అధ్యక్షులు లగచర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు










