శ్రీరాంపూర్‌లోని ప్రగతి స్టేడియంలో ఈ నెల 22న స్కూల్ గేమ్స్‌లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారుల కోసం ఒకరోజు ఫెన్సింగ్ శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు అధ్యక్షులు చిట్లా సత్యనారాయణ, కార్యదర్శి ఆవునూరి మహేష్ తెలిపారు.రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. శిక్షణ శిబిరానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే కోచ్ ఇదునూరి వెంకటేష్‌ను 95508 38190 నంబర్లో సంప్రదించాలని సూచించారు.










