దేశాల చూపు.. అల్వాల్ వైపు.|

0
4

● ఐదు దేశాల ప్రతినిధులతో దక్షిణ-తూర్పు ఆసియా ప్రాంతీయ బృందం పర్యటన

● ఎన్‌సీడీ కార్యక్రమం అమలు, డిజిటలైజేషన్ విధానాలపై అధ్యయనం

● వ్యాధుల స్క్రీనింగ్, మందుల సరఫరా, రోగుల ఫాలోఅప్‌పై అవగాహన

అల్వాల్, నవంబర్ 19:అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) అంతర్జాతీయ ప్రతినిధుల పర్యటనతో ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. దక్షిణ-తూర్పు ఆసియా ప్రాంతీయ బృందం కేంద్రాన్ని సందర్శించి, ప్రాథమిక స్థాయిలో అమలవుతున్న అసంక్రమిత వ్యాధుల (ఎన్‌సీడీ) నియంత్రణ కార్యక్రమం పనితీరును పరిశీలించింది.

అమెరికా (యూఎస్ఏ), బంగ్లాదేశ్, నేపాల్, మాల్దీవులు, తైవాన్‌కు చెందిన ప్రతినిధులు ఈ పర్యటనలో భాగమయ్యారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)కు చెందిన డా. అబ్దుల్ వస్సేతో పాటు ఎన్‌సీడీ పీవో డా. చంద్రకళ, అల్వాల్ పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డా. శ్రీకాంత్, సూపర్‌వైజర్ అరుణ, ఫార్మసిస్ట్ సృజన, ఎన్‌సీడీ స్టాఫ్ నర్స్ ప్రణయ పాల్గొన్నారు.

పీహెచ్‌సీలో ఔట్ పేషెంట్ (ఓపీ) సేవల నిర్వహణ, రోగుల రిజిస్ట్రేషన్ విధానం, ఎన్‌సీడీ కార్నర్‌లో వ్యాధుల గుర్తింపునకు చేపట్టే స్క్రీనింగ్, తదుపరి పరీక్షల ప్రక్రియను వివరించారు. అవసరమైన మందుల లభ్యత, సరఫరా వ్యవస్థ పనితీరును ప్రతినిధులకు తెలియజేశారు.

అలాగే వైద్య సేవల డిజిటలైజేషన్‌లో భాగంగా ఆరోగ్య వివరాల నమోదు, వ్యాధిగ్రస్తుల తదుపరి పర్యవేక్షణ (ఫాలోఅప్) విధానాలను వివరించారు. కార్యక్రమం అమలులో ఎదురవుతున్న సమస్యలు, క్షేత్రస్థాయి సవాళ్లను కూడా వారి దృష్టికి తీసుకెళ్లారు. అల్వాల్ పీహెచ్‌సీలో ఎన్‌సీడీ సేవలు అందిస్తున్న విధానంపై అంతర్జాతీయ బృందానికి సమగ్ర అవగాహన కల్పించారు.

#Sidhumaroju

Alwal