రెండో రోజు ఉధృతంగా కొనసాగిన ఏఐటీయూసీ రిలే నిరాహార దీక్షలు

0
5

సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజు కూడా ఉధృతంగా కొనసాగాయి. ఈ సందర్భంగా కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ నాయకులు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.ఈ దీక్షల్లో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ.. కార్మికులకు సంబంధించిన పెండింగ్ సమస్యలను పరిష్కరించడంతో పాటు, 24 రోజుల డిమాండ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా రూ.60 వేల కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లించాలని, 210 మంది డిపెండెంట్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందించాలని డిమాండ్ చేశారు.కార్మికుల హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాటం చేస్తుందని నాయకులు స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, సింగరేణి కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.