మరమ్మతులకు నోచుకోని బొబ్బిలి ప్రభుత్వ బాలికల పాఠశాల కల్వర్టు

0
5

ఆర్నబ్ తుఫాన్‌కు కొట్టుకుపోయిన కల్వర్టుకు ఇంతవరకు మరమ్మతులు చేపట్టకపోవడంతో బొబ్బిలి ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థులు, సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల ప్రధాన ద్వారం వద్ద కల్వర్టు దెబ్బతిని రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదకరంగా మారిన మార్గాన్ని అధికారులు వెంటనే పరిశీలించి, కల్వర్టు నిర్మాణ పనులు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

#RAJESH