అడ్డసారం సర్పంచిగా గుమ్మడి మాధవి ఏకగ్రీవ ఎన్నిక

0
4

 అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం అడ్డసారం గ్రామపంచాయతీ సర్పంచ్ గా ఎన్డీఏ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గుమ్మడి మాధవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ విషయాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కే సంధ్యారాణి తెలిపారు. గ్రామంలో మరే అభ్యర్థి నామినేషన్ వేయకపోవడంతో ఏకగ్రీవ ఎన్నిక ఖాయమైంది.గుమ్మడి మాధవి ఎన్నికతో గ్రామంలో కూటమి శ్రేణుల్లో సంతోషం వెల్లివిరిసింది. నాయకులు, కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.