భద్రాద్రి కొత్తగూడెం: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రజలను మభ్యపెట్టే మరో ఎన్నికల స్టంట్ మాత్రమేనని బీఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ జిల్లా నాయకుడు భూపతి శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు.
గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతు బీమా, నేతన్న బీమా వంటి పథకాలను అమలు చేసి, కుటుంబ పెద్దను కోల్పోయిన వారంలోపే రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారని గుర్తుచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పాత పథకాలకే కొత్త పేర్లు పెట్టి ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు.
ఒకవైపు అందరికీ బీమా అంటూనే మరోవైపు రేషన్ కార్డు ఆధారంగా దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బతికున్నప్పుడు ప్రజలకు బతుకుదెరువు కల్పించకుండా, చనిపోయాక బీమా ఇస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని భూపతి శ్రీనివాసరావు పేర్కొన్నారు.










