మాణిక్‌గూడలో సంక్షేమ పథకాల పత్రాల పంపిణీ

0
3

🎤ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్: ఆసిఫాబాద్ మండలం మాణిక్‌గూడ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామంలోని లబ్ధిదారులకు ‘ఇందిరమ్మ కుటుంబ బీమా’ మరియు ‘చేయూత పెన్షన్’ మంజూరు పత్రాలను ప్రజాప్రతినిధులు, అధికారులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాము, ఉప సర్పంచ్ అజయ్, పంచాయతీ కార్యదర్శి స్రవంతి ముఖ్య అతిథులుగా పాల్గొని లబ్ధిదారులకు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ