పొత్తులో భాగంగా జనసేనకు కేటాయింపు.. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు బీఫామ్ సమర్పణ

పలాస: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో కూటమి పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేటాయించిన మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికి సంబంధించి 1వ వార్డు అభ్యర్థి వాడరేవు అశోక్ జనసేన పార్టీ బీఫామ్‌ను సమర్పించారు.

పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు వైస్ చైర్మన్ పదవికి సంబంధించిన బీఫామ్‌ను అందజేసినట్లు సమాచారం. కూటమి పార్టీల మధ్య కుదిరిన పొత్తులో భాగంగా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పదవిని జనసేనకు కేటాయించడంతో వాడరేవు అశోక్ అభ్యర్థిత్వం తెరపైకి వచ్చింది.
ఈ పరిణామంతో పలాస మున్సిపల్ రాజకీయాల్లో జనసేన పార్టీకి కేటాయించిన పదవిపై స్పష్టత వచ్చినట్లయింది. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు తదుపరి ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది.










