48 సీసాలతో వ్యక్తి అరెస్టు, బైక్ సీజ్

పలాస: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కాంట్రగడ జంక్షన్ వద్ద ఎక్సైజ్ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ద్విచక్ర వాహనంపై అక్రమంగా ఒడిశా మద్యం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
బైక్పై 48 ఒడిశా మద్యం సీసాలను తరలిస్తుండగా రోణంకి శేషగిరిని ఎక్సైజ్ అధికారులు పట్టుకుని అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న మద్యాన్ని ఎన్డీపీఎల్ (నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్)గా గుర్తించారు. మద్యంతో పాటు బైక్ను సీజ్ చేసి, నిందితుడిని స్టేషన్కు తరలించారు.
ఈ దాడుల్లో ఏఈఎస్ టాస్క్ ఫోర్స్ సీఐ మధుకుమార్, పలాస ఎక్సైజ్ సీఐ మల్లికార్జునరావు, సిబ్బంది పాల్గొన్నారు.









