గవినివారిపాలెంలో సర్పంచ్ ఎన్నికల ప్రచార హోరు* *మంచం గుర్తుకు ఓటేయాలని గవిని నాగేశ్వరరావు పిలుపు*

0
3

చీరాల మండలం గవినివారిపాలెం గ్రామంలో స్థానిక పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. సర్పంచ్ అభ్యర్థి గవిని నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గవినివారిపాలెం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని, తన ఎన్నికల గుర్తు మంచం అని తెలిపారు.రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొలినాళ్ల నుంచే గ్రామంలోని ఆలయాల అభివృద్ధికి లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించానని పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామ యువతకు క్రీడా మైదానం ఏర్పాటు కోసం ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా తన వంతు సహకారం అందించినట్లు తెలిపారు.తనను సర్పంచ్‌గా గెలిపిస్తే గవినివారిపాలెం గ్రామంలో గతంలో ఎన్నడూ చూడని రీతిలో అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.అనంతరం ప్రచారంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు “మంచం గుర్తుకే మన ఓటు.. గవిని నాగేశ్వరరావును గెలిపిద్దాం” అంటూ నినాదాలు చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగించారు.