తెనాలి పారిశుధ్యం పై చైర్మన్ ఆకస్మిక తనిఖీలు

0
3

తెనాలి పట్టణంలో నీ పలు వార్డులలో ఉదయం మున్సిపల్ చైర్మన్ తోటకూర వెంకట రమణారావు కౌన్సిలర్లతో కలసి పర్యటించారు. బాలాజీ రావు పేట, కాల్వకట్ట రోడ్డు,గిరి రోడ్డు ప్రాంతాలలో పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. రోడ్లపై పేరుకుపోయిన చెత్తా,చెదారాన్ని వెంటనే తొలగించేశారు. పారిశుద్ధ్య నిర్వహణలో  నిర్లక్ష్యం వహించవద్దని పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.