ఆసిఫాబాద్ జిల్లాలో కో-ఆర్డినేటర్ పోస్టు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

0
0

🎤ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, భద్రతా చర్యల పర్యవేక్షణకు కో-ఆర్డినేటర్ పోస్టును ఒప్పంద (కాంట్రాక్ట్) పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ కె. హరిత ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సివిల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 1 సాయంత్రం 5 గంటల్లోగా జిల్లా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.