మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ రామాలయం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం…

0
1

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెండెం శ్రీలక్ష్మీరామానంద్‌

భరత్ అవాజ్ న్యూస్ :వరంగల్ జిల్లానర్సంపేట లో రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించడంతో పాటు దళారుల ప్రమేయం లేకుండా విక్రయించుకునేందుకు కొనుగోలు కేంద్రాలు దోహదపడతాయని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెండెం శ్రీలక్ష్మీరామానంద్‌ అన్నారు. శుక్రవారం నర్సంపేట మున్సిపాలిటీ 3వ వార్డు కమలాపురంలో శ్రీ వెంకటేశ్వర రైతు సంఘం ఎఫ్‌పీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు దళారులకు విక్రయించి నష్టపోకుండా కేంద్రాల్లోనే ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని సూచించారు. కేంద్రాల వద్ద అవసరమైన సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులను ఆదేశించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ ముత్తినేని వెంకన్న, పంబి వంశీకృష్ణ, ఎర్ర యాకూబ్‌రెడ్డి, కంచు రవి, కాట ప్రభాకర్‌, లోడే రాజు, ఎఫ్‌పీఓ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.. దుగ్గొండి మండలం రిపోర్ట్ జి రాము