తిరుపతి వెళ్లి వచ్చేలోపు ఇల్లు గుల్ల చేసిన దుండగులు.. విలువైన ఆభరణాలు మాయం…
ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి యాత్రకు వెళ్లిన ఓ వ్యక్తి ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు.
భరత్ అవాజ్ న్యూస్ :వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లో ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతోకలిసి తిరుపతి యాత్రకు వెళ్లిన ఓ వ్యక్తి ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు సుమారు రూ. లక్ష విలువైన బంగారు, వెండి ఆభరణాలు అపహరించారు. దుగ్గొండి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ముప్పారపు సందీప్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నెల 22న ఉదయం గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి తిరుపతి దేవస్థానానికి వెళ్లాడు. దర్శనం అనంతరం ఈ నెల 25న రాత్రి ఇంటికి తిరిగి వచ్చి చూడగా, ఇంటి తలుపులకు వేసిన తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లో పరిశీలించగా బంగారు, వెండి ఆభరణాలు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించాడు. దీంతో బాధితుడు గురువారం దుగ్గొండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు దుగ్గొండి ఎస్సై మహేందర్ తెలిపారు… దుగ్గొండి మండలం రిపోర్ట్ జి రాము









