సికింద్రాబాద్ : ప్రముఖ దేవాలయంలో 16ఏళ్ల పాటు పని చేసిన ఒక మహిళ అదే దేవాలయం ముందు యాచకురాలిగా మారింది.
సికింద్రాబాద్ బోయిన్ పల్లిలోని తాడ్ బంద్ వీరాంజనేయ దేవాలయంలో ఇందిరా అనే మహిళ దాదాపు 16ఏళ్ల పాటు కేవలం ₹6వేల వేతనంతో తన సేవాలందించింది. అయితే ఇటీవల ఆ దేవాలయం దేవాదాయశాఖ ఆధీనంలోకి వెళ్లడం జరిగింది.
కాగా కొత్తగా వచ్చిన అధికారి హాయంలోనూ 8నెలల పాటు పనిచేసిన తనను నెల క్రితం విధుల్లోంచి తొలగించడం జరిగిందని ఇందిర తెలిపింది. తన భర్త చనిపోవడం ఉన్న ఒక్క కొడుకు దివ్యాంగుడు, మరో కూతురు తనపైనే ఆధారపడి ఉన్నారని ఆవేధన వ్యక్తం చేసింది.
వారి పోషన తమ పొట్టకూటి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఇదే దేవాలయం ముందు యాచకురాలిగా మారిపోవలసి వచ్చిందని వాపోయింది. తనను మల్లీ విధుల్లోకి తీసుకొని భగవంతుడి సేవ చేసుకొనే అవకాశాన్ని కల్పించాలని ఆమె వేడుకుంటుంది.
Sidhumaroju
