పట్టణంలో మరియు మండలంలో ని గ్రామాలలో ప్రజా సమస్యలు పరిష్కరించడంలో పాలకులు, అధికారులు విఫలమయ్యారని సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి జే, మోహన్ విమర్శించారు,, గూడూరు పట్టణంలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారం కొరకు గూడూరులో మున్సిపాలిటీ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో ప్రాంతీయ కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు అధ్యక్షతన సిపిఎం నాయకులు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది,, ఈ సందర్భంగా సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి
జే,మోహన్ మాట్లాడుతూ…. గూడూరు పట్టణంలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, దశాబ్దాలు గడిచిన సమస్య పరిష్కారం కావడం లేదని, గూడూరును మున్సిపాలిటీ చేసి ప్రజలపై పన్నుల భారాలు వేసి పన్నులు వసూలు చేస్తున్నారు తప్ప ప్రజలకు మంచినీటి సమస్య గాని కనీస వసతులు కల్పించడంలో గాని అధికారులు పాలకులకు చేతులు రావడంలేదని,, గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ 54 కోట్లతో గూడూరు పట్టణానికి నాలుగు దిక్కుల
స్తంభాలుగా నాలుగు ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం చేపట్టి మధ్యలోనే ట్యాంకుల నిర్మాణం ఆగిపోయిందని, ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పాలకులు, నాయకులు ఈ ట్యాంకుల నిర్మాణం గురించి మాట్లాడడం లేదని, పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడానికి నిర్మాణం చేపట్టిన నాలుగోవ రెడ్డి ట్యాంకుల పనులు వెంటనే పూర్తి చేసి గూడూరు పట్టణ ప్రజలకు త్రాగునీరు అందించాలని, గూడూరు పట్టణంలో రోడ్డు విస్తరణ లేకపోవడంతో
ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరుగుతోందని, ట్రాఫిక్ సమస్య పరిష్కారం కొరకు రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేపట్టి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని, గూడూరు నగర పంచాయతీ చేయడంతో ఉపాధి హామీ పథకాన్ని రద్దు కావడంతో
ఇక్కడున్న పేద ప్రజలు వేసవికాలంలో పనులు లేక వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని,, ఉపాధి హామీ పథకాన్ని గూడూరు పట్టణానికి అమలు చేసి పేద ప్రజలందరికీ ఉపాధి పనులు కల్పించాలని, మునగాల రోడ్డులో ఉన్న డంప్యాడ్ వల్ల ఆ ప్రాంతంలోని ప్రజలందరూ కంపాడు నుంచి వస్తున్న దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు,
