కర్నూలు సిటీ : నమ్మకద్రోహం , దొంగతనం చేసిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ …కర్నూలు సిటీ, కోడుమూరు రోడ్ లో కల మహేక్ ఎంటర్ప్రైసెస్ సానిటరీ షాప్ నందు గుమస్తాగా నమ్మకం గా పనిచేస్తూ, యజమాని నమ్మకం చూడగానే యజమాని లేని సమయంలో స్నేహంతో కలిసి షాపులోనూ వస్తువులు దcommods, వాష్ బేసిన్ లు, హ్యాండ్ వాష్
బేసిన్స్, కిచెన్ ఐటమ్స్ ఇలా రక రకాల ఐటమ్స్ ను వీరు ఇద్దరు కలిసి దొంగలించి వారి యజమానే పంపించినట్టుగా బయటి వారిని నమ్మిస్తూ సుమారు రూ. 7 లక్షల విలువ చేసే వస్తువులను అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు.యజమాని సల్మాన్ ఇచ్చిన ఫిర్యాదు పై నమ్మకద్రోహం, దొంగతనం కింద కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు లో వీరు ఇరువురు సదరు నేరానికి పాల్పడినారు అని ధ్రువీకరించుకొని
వారిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని విచారించారు. వారు దొంగతంగా అమ్ముకున్న వస్తువులను అన్నిటిని రికవరీ చేసుకొని సదరు యజమానికి అప్పగించి సదరు నేరానికి పాల్పడిన ఇద్దరిని రిమాండ్ కి పంపడం జరుగుతుంది….ఈ కార్యక్రమంలో నాల్గవ పట్టణ సిఐ విక్రమసింహా గారితో పాటు ఎస్సైలు చంద్రశేఖర్, శరత్ కుమార్ రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గోన్నారు.
