బాపట్ల: ప్రభుత్వ పాఠశాలలు, వైద్యశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూపొందిస్తున్న ప్రత్యేక వెబ్‌సైట్ను రెండు రోజుల్లో పూర్తి చేసి, జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్.
గారు అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల పాఠశాలలు, వైద్యశాలలు, వసతి గృహాలకు అవసరమైన ఫర్నిచర్, కంప్యూటర్లు, ఫ్యాన్లు, దుప్పట్లు, పుస్తకాలు తదితరాలను పెండింగ్ అవసరాలుగా వెబ్‌సైట్‌లో నమోదు చేయాలన్నారు. ఈ వేదిక ద్వారా దాతలు, అధికారులు స్వచ్ఛందంగా సహకరించే అవకాశం కల్పించడమే లక్ష్యమని తెలిపారు.
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పెంచి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ వెబ్‌సైట్ ఉపయోగపడుతుందన్నారు.
#Narendra
