శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఈ నెల 23వ తేదీ, శుక్రవారం నాడు శ్రీ పంచమి (వసంత పంచమి) పర్వదినం అత్యంత వైభవంగా నిర్వహించ తలపెట్టడమైనది.
చదువుల తల్లి సరస్వతీ దేవి జన్మదినంగా భావించే ఈ పవిత్ర రోజున ఇంద్రకీలాద్రిపై విశేష పూజలు మరియు కార్యక్రమాలు నిర్వహించబడతాయని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికె. శీనానాయక్ తెలిపారు.
అమ్మవారి అలంకారం:
శ్రీ పంచమి సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ వారు “శ్రీ సరస్వతీ దేవి” అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్వేత వస్త్రధారిణియై, చేతిలో వీణను ధరించి, పుస్తకము, అక్షరమాలను పట్టుకుని జ్ఞానప్రదాయినిగా అమ్మవారు అటు ప్రధాన ఆలయంలోను, ఇటు మహా మండపం 6వ అంతస్తులో భక్తులను అనుగ్రహించనున్నారు.
ఉదయం నుండే భక్తులు ఈ విశేష అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవచ్చు.
సామూహిక అక్షరాభ్యాసములు:
చిన్నారులకు విద్యాభ్యాసం ప్రారంభించడానికి శ్రీ పంచమి అత్యంత ప్రశస్తమైన రోజు కావడంతో, దేవస్థానం వారు భక్తుల సౌకర్యార్థం సామూహిక అక్షరాభ్యాసములు ఏర్పాటు చేశారు.
మల్లికార్జున మహామండపం 6 వ అంతస్తులో
ఉదయం 07:00 గంటల నుండి ప్రారంభమవుతాయి.
దేవస్థానం యాగశాల లో శ్రీ సరస్వతి యాగం నిర్వహించబడును.
అక్షరాభ్యాసానికి కావలసిన పలక, బలపం మరియు ఇతర పూజా సామాగ్రిని దేవస్థానమే సమకూరుస్తుంది.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడమైనది. భక్తులకు ఉచిత ప్రసాదం మరియు తాగునీటి సౌకర్యం కల్పించబడింది. వసంత పంచమి రోజున సరస్వతీ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని, చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాము.
ఈ సందర్బంగా విద్యార్థులకు దేవస్థానం నుండి ఇచ్చుట నిమిత్తం పెన్ను, అమ్మవారి చిత్రం, కుంకుమ తదితరముల ప్యాకింగ్ మహా మండపం 4 వ అంతస్తులో ఫెస్టివల్ సెక్షన్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది.
సదా శ్రీ దుర్గా మల్లేశ్వరుల సేవలో…
చైర్మ
న్, కార్యనిర్వహణా ధికారి.
