వైసీపీ అధినేత జగన్ ప్రెస్ మీట్..
ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై జగన్ ప్రెస్ మీట్. భూముల రీ సర్వేపై చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారు. ఈ భూమండలం మీద ఇంత దారుణమైన క్రెడిట్ చోరీ చేయగలవారు ఎవరూ ఉండరు.: జగన్
భూముల రీసర్వే చేయాలన్న కనీస ఆలోచన కూడా ఎప్పుడైనా వచ్చిందా చంద్రబాబు.. రైతుల సమస్యలు తీర్చాలన్న కనీస ఆలోచన బాబుకు వచ్చిందా.? రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారమే రీ సర్వే. 2019 కంటే ముందు భూములు సర్వే చేసే టెక్నాలజీ లేదు.. భూములు రీ సర్వే చేయించాలని నా పాదయాత్రలో నిర్ణయించా: జగన్ మోహన్ రెడ్డి
మేం అధికారంలోకి వస్తే సమగ్ర భూ సర్వే చేయిస్తానని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం.. రైతులకు, ప్రజలకు వివాదాలు లేనివిధంగా, పారదర్శకంగా భూములు సర్వే చేశాం.. ట్యాంపరింగ్ చేయలేని విధంగా భూ యజమానులకు, రైతులకు శాశ్వత పత్రాలు ఇచ్చాం. భూసర్వేను మహాయజ్ఞంలా చేపట్టాం: వైఎస్ జగన్
వందేళ్లక్రితం బ్రిటిషర్ల కాలంలో భూ సర్వే చేశారు.. 2020 డిసెంబర్ 21న భూముల రీ సర్వే ప్రారంభించాం. నాలుగు సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఏనాడైనా ఇలా చేశారా..? క్రయవిక్రయాలు జరిగినా సమస్యలు లేకుండా చేశాం.. అన్నదమ్ముల మధ్య పంపకాలు జరిగినా ఇబ్బందులు లేకుండా చేశాం: వైఎస్ జగన్
ఏకంగా 15 వేల గ్రామ సచివాలయాలు ఒక రికార్డు.. ప్రతీ సచివాలయంలో 10 మంది ఉద్యోగుల నియామకం కూడా రికార్డే. ఒక్క నోటిఫికేషన్ తోనే లక్షా 34 వేల ఉద్యోగాలు ఇచ్చాం. యూరప్, అమెరికాలో వాడే టెక్నాలజీతో భూముల రీ సర్వే చేశాం. గ్రామ సచివాలయాల్లోనే భూ రిజిస్ట్రేషన్లు చేశాం: వైఎస్ జగన్
మేం చేసిన భూ సర్వేను చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు. 80 ఏళ్ల వయసున్న చంద్రబాబు ఎప్పుడైనా ఇలా చేశారా..? సర్వేలో హెలికాప్టర్లు, డ్రోన్లు వినియోగించాం. టెక్నాలజీపై అవగాహన కోసం 40 వేల మందికి శిక్షణ ఇచ్చాం. కోట్ల సంఖ్యలో సర్వే రాళ్లను గ్రామాలకు తరలించాం. 5 సెం.మీ కూడా తేడా లేకుండా కొలతలు వేశాం. రాష్ట్రంలో భూవివాదాల పరిష్కారానికి 1358 మండల మొబైల్ మెజిస్ట్రేట్లను ఏర్పాటు చేశాం: వైఎస్ జగన్
భూసర్వేకు కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్నాం.. 2020, డిసెంబర్ 9న సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం. భూ సర్వే కోసం 3640 GNSS ఉపయోగించాం. నిజాలను ఎంతో కాలం తొక్కిపెట్టలేరు. భూముల రీ సర్వేను నీతి ఆయోగ్ ప్రశంసించింది. కేరళ, ఉత్తరాఖండ్ అధికారులు సర్వేను అధ్యయనం చేశారు. మహారాష్ట్ర అధికారులు అధ్యయనం చేసి ప్రశంసించారు: వైఎస్ జగన్
సర్వేను .. అప్పటి సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ మెచ్చుకున్నారు. అసోం రాష్ట్రం కూడా మా ప్రభుత్వ సహకారం కోరింది. ఎన్నికల సమయంలో IVRS కాల్స్ చేసి రైతులను భయపెట్టారు. మీ భూములు మీకు కాకుండా పోతాయని దుష్ప్రచారం చేశారు. భూముల రీ సర్వేపై చంద్రబాబు యూటర్న్ ఎందుకు తీసుకున్నారు? మా పని వల్ల కేంద్రం నుంచి రూ. 400 కోట్ల రాయితీ వచ్చింది. భూముల రీ సర్వేకు రూ. 6 వేల కోట్లకు పైగా ఖర్చు చేశాం. రీ సర్వేలో ఏపీకి కేంద్రం ప్రాటినమ్ గ్రేడ్ ఇచ్చింది: వైఎస్ జగన్
