ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటు వంటి నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి కృషి చేస్తున్నది. దీనిలో భాగముగా నిరుద్యోగ యువతకు వారికి ఉద్యోగ మేళాలు నిర్వహించి ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద సహకారం తో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు మరియు మంగళగిరి నియోజకవర్గం గౌరవ శాసన సభ్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ నెల 13-02-2026వ తేదీన VTJM & IVTR డిగ్రీ కళాశాల,వెజిటబుల్ మార్కెట్ దగ్గర, మంగళగిరి నందు జరగబోవు ఉద్యోగ మేళా పోస్టర్ను శ్రీమతి ఎ. తమీమ్ అన్సారియ IAS, కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ గారు కలెక్టర్ ఛాంబర్ నందు మెగా జాబ్ మేళ పోస్టర్ ను విడుదల చేసిన్నారు.
జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి కృషి చేస్తున్నది అని తెలియజేశారు. ఈ జాబ్ మేళాకు సుమారు 15 కంపెనీలు పాల్గొంటున్నాయి, మరియు 597 ఉద్యోగ అవకాశములు ఉన్నాయి. కావున జిల్లా లో వున్నా యువతి యువకులు ఈ జాబ్ మేళాలో లో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం, చేసుకొనవలసిందిగా తెలియజేశారు.
ఈ కార్యక్రములో శ్రీ అశుతోష్ శ్రీవాస్తవ, I.A.S., శ్రీ ఎన్.ఎస్.కె. ఖాజావలి, DRO, శ్రీమతి విజయలక్ష్మి PD-DRDA మరియు శ్రీ కె. సంజీవరావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పాల్గొనారు.
గుంటూరు జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి శ్రీ కొండా సంజీవరావు గారు మాట్లాడుతూ ఈ మెగా జాబ్ మేళాలో 10వ తరగతి నుంచి బి.టెక్ వరకు చదువు కొన్న ప్రతి ఒక్కరు ఈ జాబ్ మేళ లో పాల్గొని ఈ గొప్ప అవకాశమును సద్వినియోగం చేసుకొనవలసిందిగా తెలియజేశారు ఈ కార్యకరములో ఎఫ్ట్రానిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, CII-MCC (TTEC)NCC లిమిటెడ్,మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ, TRENT లిమిటెడ్,చెరిష్ పవర్ టెక్,సంతోష్ ఆటోమోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్, వంటి పలు రకాల కంపెనీలు హాజరవుతున్నాయి అని తెలియజేసారు.
జీతం వారి విధ్యర్హతను బట్టి సుమారు 9000 – 35,000 రూపాయల వరకు ఉండవచ్చని తెలిపారు
ఈ జాబ్ డ్రైవ్ కు ఎస్.ఎస్.సి, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, బి.టేక్, డిప్లొమా, ఫార్మసి, మరియు పి.జి విభాగముల వరకు చదువుకున్నటు వంటి 18-25 సం||ల వయసు గల నిరుధ్యోగ యువతి యువకులు వారి యొక్క బయోడేటా లేదా రెస్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ జిరాక్స్, ఆధార్ నకలు మరియు పాస్ పోర్ట్ ఫోటో తో నేరుగా ఇంటర్వ్యూ కు హాజరు కాగలరు.
చిరునామా:
తేదీ : 13-02-2026
సమయం : ఉదయం 10:00 నుండి సాయంత్రం 04:00 వరకు ఇంటర్వూలు జరుగును.
స్థలం : VTJM & IVTR డిగ్రీ కళాశాల,వెజిటబుల్ మార్కెట్ దగ్గర, మంగళగిరి.
సంప్రదించవలసిన నంబర్లు :- జి.వి.ఎస్. సాయి కుమార్ (8074597926), SK.బాజీ(7780588993), దామా వెంకట సందీప్ (9966788993).
ఔత్సాహిక యువతి యువకులు ముందుగా https://naipunyam.ap.gov.in/ అనే వెబ్ సైట్ నందు రిజిస్టర్ చేసుకోగలరు. మరిన్ని వివరములకు కంట్రోల్ నంబర్: 9988853335, 8712655686, 8790118349, 8790117279 మరియు పైన తెలిపిన నంబర్లను సంప్రదించగలరు.
గమనిక: యువతీ యువకులు జాబ్ డ్రైవ్ జరుగు ప్రదేశం నందు స్పార్ట్ రెజిస్ట్రేషన్ సౌకర్యం కలదు.
