మదనపల్లి సమీపంలోని జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో శివప్రసాద్ (28) అనే యువకుడు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
వలసపల్లికి చెందిన శివప్రసాద్, మోహిత్ బైక్‌పై వెళ్తుండగా, పలమనేరుకు వెళ్తున్న మురళి బైక్‌తో ఎదురెదురుగా ఢీకొన్నాయి. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శివప్రసాద్ మరణించాడు.
తాలూకా సీఐ కళావెంకటరమణ ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
