మదనపల్లె : ఆర్ఓ పల్లవికి వరస్ట్ వారెంట్.

0
6

మదనపల్లె మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ జీవి పల్లవికి హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ప్లాన్ అనుమతి లేకుండా జరుగుతున్న నిర్మాణాన్ని అడ్డుకోలేదని ఆరోపిస్తూ దాఖలైన కేసులో విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించినప్పటికీ ఆమె హాజరుకాలేదు.

దీనిని కోర్టు ధిక్కారంగా భావించి, బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ, ఈనెల 30న న్యాయస్థానం ముందు హాజరు పరచాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు ఇచ్చింది. అరెస్ట్ చేసిన పక్షంలో రూ. 10 వేల బాండ్, ఇద్దరి పూచీకత్తుపై బెయిల్ ఇవ్వవచ్చని కోర్టు పేర్కొంది.