ఉపాధి హామీ పథకం పనుల్లో సమయపాలన పాటించాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలం రంగరాయపురంలోని రంగరాయ చెరువులో పనులను మంగళవారం పరిశీలించారు. కనీస వేతనాలు వచ్చేలా రెండు పూటలు పనులు చేపించాలని కోరారు. పనులు వద్ద నీరు, నీడ ఏర్పాటు చేయాలని కోరారు. కొలతలు ప్రకారం పనులు చేయాలని ఆదేశించారు. పనులపై వేతనదారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
#Boiena Rajesh










