18/4/ 2026 హైదరాబాదులో తెలంగాణ ఉద్యమకారుల విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతూ
ఈరోజు కోదాడ పట్టణంలోని స్థానిక అమ్మ మెడికల్ ఏజెన్సీ వద్ద కోదాడ నియోజకవర్గం తెలంగాణ ఉద్యమకారుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సూర్యపేట జిల్లా అధ్యక్షులు గుండెపంగు రమేష్ మాట్లాడుతూ రేపు హైదరాబాద్ తార్నాక మర్రి కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్ నందు జరగబోవు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం సభను విజయవంతం చేయాలని కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులకు పిలుపునిస్తూ
ప్రతి మండలం, ప్రతి గ్రామం నుంచి తెలంగాణ ఉద్యమకారులు అధిక సంఖ్యలో రావాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కోదాడ మండల అధ్యక్షులు కోళ్లూరి వెంకటేశ్వర్లు, మునగాల మండల అధ్యక్షులు పోలంపల్లి వెంకటేశ్వర్లు, అనంతగిరి మండల అధ్యక్షులు ధారావత్ సైదులు, తొలి దశ మలిదశ ఉద్యమకారులు ఏనుగుల యల్లేశ్వరరావు, మట్టపల్లి శ్రీనివాస్ గౌడ్,ఎస్ కే మీరా, బొమ్మకంటి వీరబాబు, కరుణాకర్, మండవ నాగేశ్వరరావు బొంత శివాజీ, ముక్కు రాములు,ఆదిమల్ల రాజశేఖర్, రాజు, ఆనంద్, గోపికృష్ణ, సైదులు, సత్యనారాయణ, ఎండి హుస్సేన్ అలీ, సుదర్శన్, తిరుమలరావు, బాలిబోయిన ఏడుకొండలు, కే నాగేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు
భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి










