పుంగనూరులో అగ్ని ప్రమాదాలపై అవగాహన

0
4

పుంగునూరు పట్టణంలో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా, శుక్రవారం భాష్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అగ్ని ప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఇన్చార్జి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కె. సురేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బందితో పాటు అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. ఈ అవగాహన కార్యక్రమం అగ్ని ప్రమాదాల నివారణలో విద్యార్థులకు కీలక సమాచారాన్ని అందించింది# కొత్తూరు మురళి.