పార్లమెంట్ లో తెలంగాణ విభజన పై భారత్ పాకిస్థాన్ తో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్న మంత్రి పొన్నం ప్రభాకర్.తెలంగాణ ఏర్పాటు అనేది ఇక్కడి ప్రజల న్యాయమైన ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ, ఒక ప్రజాస్వామ్య,రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ ఫలితంగా జరిగింది.
దీనిని భారతదేశపు బాధాకరమైన, హింసాత్మక విభజనతో పోల్చడం ఆ ప్రక్రియ యొక్క పవిత్రతను తగ్గించడమే కాక, తెలంగాణ ప్రజల మనోభావాలను విస్మరించినట్లు అవుతుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్.ఇటువంటి ప్రకటనలు ప్రజా సామరస్యాన్ని దెబ్బతీయడానికి, ప్రాంతీయ కలహాలను పెంచడానికి, చారిత్రక మరియు రాజ్యాంగ వాస్తవాలను వక్రీకరించడానికి అవకాశం ఉందన్న మంత్రి పొన్నం ప్రభాకర్.తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి మరియు ప్రజా శాంతి, సామరస్యాలను కాపాడటానికి, ఈ విషయాన్ని పరిశీలించి, చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ నీ కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్.










