“మండుటెండలో ‘పోలీస్’ చల్లని పిలుపు: తిరుమలగిరిలో చలివేంద్రం ప్రారంభం!

0
6

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని, సామాన్య ప్రజల దాహార్తిని తీర్చేందుకు ట్రాఫిక్ పోలీసులు అడుగు ముందుకు వేశారు.

మల్కాజిగిరి పరిధిలోని తిరుమల్ గిరి ట్రాఫిక్ ఏసీపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఉచిత తాగునీటి చలివేంద్రాన్ని ఏసీపీ  జి. శంకర్ రాజు  ఈరోజు ఘనంగా ప్రారంభించారు.

MV ఆటోమొబైల్స్ మరియు హైజీన్ ఆక్వా సొల్యూషన్స్ సంస్థల సామాజిక బాధ్యత (CSR) కింద ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఏసీపీ శంకర్ రాజు మాట్లాడుతూ.. వేసవిలో పాదచారులు, వాహనదారులు మరియు నిత్యం ప్రయాణించే వారు ఎండ వేడికి ఇబ్బంది పడకుండా ఉండేందుకే ఈ ఏర్పాటు చేశామని తెలిపారు. సురక్షితమైన తాగునీటిని అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని ఆయన పేర్కొన్నారు.

ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు ప్రజల సంక్షేమం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందని ఏసీపీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో హైజీన్ ఆక్వా సొల్యూషన్స్ యజమాని శ్రీహరి, MV ఆటోమొబైల్స్ ప్రతినిధులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలందరూ ఈ చలివేంద్రాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. సమాజ హితం కోసం సహకరించిన సంస్థలకు ఈ సందర్భంగా పోలీస్ శాఖ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

#Sidhumaroju