అన్నమయ్య జిల్లా మదనపల్లె డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన పావనిని పుంగనూరు టీడీపీ జిల్లా కార్యదర్శి రాఘవ రాయల్, జనసేన నాయకుడు జనార్ధన రాయల్, మదనపల్లె
టీడీపీ నాయకురాలు శ్యామల రాయల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమస్యలు, లా అండ్ ఆర్డర్ గురించి డీఎస్పీతో చర్చించినట్లు రాఘవ రాయల్ తెలిపారు. ఈ సమావేశం మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో జరిగింది.










